After Shikhar Dhawan, Ajinkya Rahane and wife Radhika get first dose of COVID-19 vaccine
#Bcci
#Teamindia
#Coronavaccine
#AjinkyaRahane
#Rahane
#Ashwin
#ShikharDhawan
టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 32 ఏళ్ల జింక్స్ తన సతీమణి రాధికతో కలిసి ముంబైలోని వ్యాక్సిన్ కేంద్రంలో కరోనా మొదటి డోసు వేయించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ మంగళవారం వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న రహానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో వచ్చిన అవకాశాలను జింక్స్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.